గత ఎన్నికలలో హిందూపురం నుంచి ఎం.ఎల్.ఏ గా ఎన్నికై, అసెంబ్లీలో అడుగుపెట్టాడు నందమూరి బాలకృష్ణ. ఈసారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నాడు. 2014లో అత్యంత సునాయాసంగా గెలిచిన బాలయ్యకు ఈసారి హిందూపురంలో ఇక్కట్లు తప్పకపోవచ్చని విశ్లేషకుల అంచనా. రాష్ట్రమంతటా టీడీపీకి వైకాపా గట్టి పోటీ ఇస్తోంది.
హిందూపురంలోనూ బాలయ్యకు పోటీ గట్టిగానే ఉంది. అక్కడ ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 50 వేలమంది ముస్లిం ఓటర్లున్నారు. వైకాపా నుంచి ముస్లిం అభ్యర్థినే రంగంలోకి దిగాడు. ఆ ఓట్లన్నీ.. వైకాపాకి షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా హిందూపురంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బాలయ్య ఎం.ఎల్.ఏగా ఉన్నప్పుడు ఆ సమస్యని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే... హిందూపురం టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ అక్కడి నుంచే ఎం.ఎల్.ఏగా ఎన్నికై.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. టీడీపీకి బలమైన క్యాడర్ అక్కడ ఉంది. పైగా ఇక్కడి నుంచి ఏకంగా 8సార్లు టీడీపీ పార్టీ గెలిచింది. ఈసారి కూడా బాలయ్యకు అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పడుతారని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అయితే.. ఈసారి బాలయ్య గెలుపు అంత తేలిక కాదు. ఆయన సీటుని కాపాడుకోవాలంటే... గట్టి పోటీ ఎదుర్కొని నిలబడాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.