తమిళ డైరెక్టర్ విజయ్‌తో వివాహ బంధాన్ని రద్దు చేసుకుని కెరీర్‌లో బిజీ అయిన ముద్దుగుమ్మ అమలాపాల్ ప్రస్తుతం తమిళంలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది. కేరళ పోలీస్ శాఖకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ సర్జన్ బి.ఉమాదతాన్ జీవితంలో ఎదురైన ఓ మర్డర్ కేస్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌గా అమలాపాల్ నటిస్తోంది. 'కడవేర్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి అమలాపాల్ లీడ్ రోల్ పోషించడంతో పాటు, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
నిర్మాతగా అభిరుచి గల సినిమాల్ని, విభిన్న కథాంశం ఉన్న సినిమాల్ని రూపొందిస్తోన్న అమలాపాల్‌కి ఇటు నటన పరంగానూ, అటు నిర్మాణం పరంగానూ ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా చాలా కష్టపడ్డారట. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అంటే నిరంతరం డెడ్ బాడీస్‌పై రీసెర్చ్ చేస్తుండాలి. అందుకోసం చాలా గట్స్ ఉండాలి. ఏదో సినిమా కోసం అన్నట్లుగా కాకుండా, రియల్‌గా పాత్రలో ఇన్‌వాల్వ్ అయిపోయి మార్చురీల్లో డెడ్‌బాడీస్‌ని పరిశీలించడంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట అమలాపాల్.
గతంలోనూ అమలాపాల్ పలు ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించారు. కానీ ఈ పాత్ర తనకు అసలు సిసలు సవాల్ విసురుతోందని అమలాపాల్ చెబుతుండడం విశేషం. తెలుగులో 'నాయక్', 'బెజవాడ' తదితర చిత్రాల్లో నటించింది అమలాపాల్. ప్రస్తుతం మలయాళ, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మంచి కథలొస్తే, తెలుగులో నటించేందుకు టైం కేటాయిస్తానంటున్నారు అందాల నటి అమలాపాల్.