మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష, జరిమానా అంటూ వస్తున్న వార్తల్ని తాజాగా ఆయన ఖండించారు. 'నాపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలు. అదంతా దుష్ప్రచారమే..' అంటూ మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'నేను ఇంట్లోనే ఉన్నాను. ఎవరో కావాలని నాపై ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. జైలు శిక్ష అంతా ఉత్తదే..' అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ఈ మ్యాటర్‌ని రీ ట్వీట్ చేశారు.
Just heard about the false news propaganda by a few TV networks. Much to their disappointment, I am at my home in Hyderabad.
— Mohan Babu M (@themohanbabu) April 2, 2019
'రాజకీయాల్లోకి వచ్చాను కదా.. ప్రత్యర్ధులు పర్యవేక్షణలో నాపై ఇలా ఓ సెక్షన్ మీడియా బ్యాడ్ ప్రోపగండా చేస్తోందనీ మోహన్‌బాబు చెప్పారు. అయితే ఈ కేస్ ఇప్పటిది కాదు, తొమ్మిదేళ్ల క్రితం నాటి కేసు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'సలీం' సినిమాకి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు. వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో మంచు విష్ణుతో పాటు, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలో నటించారు.
ఆ తరుణంలోనే డైరెక్టర్‌కిచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా వై.వి.ఎస్ చౌదరి కోర్టునాశ్రయించగా, తొమ్మిదేళ్ల విచారణ తర్వాత మంగళవారం హైద్రాబాద్ ఎర్రమంజిల్ కోర్టు తుది తీర్పు వెలువరించి మోహన్‌బాబుకు జైలు శిక్ష విధించింది. అయితే ఇదంతా ఉత్తదేనంటూ మోహన్‌బాబు ఖండించడం ఆశ్చర్యకరం.
Clarification of Cheque bounce issue by Dr.M Mohan Babu garu @themohanbabu @iVishnuManchu @HeroManoj1 pic.twitter.com/jPFlrqb2KN
— Vamsi Shekar (@UrsVamsiShekar) April 2, 2019