మెగా ఆఫర్‌: త్రిష కన్‌ఫామ్‌ చేసేసిందిగా.!

By Inkmantra - December 16, 2019 - 11:32 AM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ 152వ సినిమాలో హీరోయిన్‌ పలానా.. అంటూ పలు పేర్లు ప్రస్థావనకొచ్చాయి. కానీ, ఎవరో ఒక్కరు మాత్రమే కదా కన్‌ఫామ్‌ కావల్సింది. ఆ ఒక్కరు ఎవరో తేలిపోయినట్లే ఉంది. గత కొంతకాలంగా మెగాస్టార్‌ సినిమాలో త్రిష హీరోయిన్‌ అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ సోషల్‌ ప్రచారం మీదుగానే ఈ విషయం కన్‌ఫామ్‌ అయినట్లుగా కనిపిస్తోంది.

 

ఓ కోలీవుడ్‌ క్రిటిక్‌ త్రిష ఫ్యూచర్‌ ప్రాజెక్టుల లిస్టు సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. అందులో చిరంజీవి - కొరటాల సినిమా కూడా ఉందని ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌ని విక్టరీ సింబల్‌తో త్రిష కన్‌ఫామ్‌ చేసింది. అంటే మెగాస్టార్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి త్రిష ఖరారయ్యిందని నెటిజన్లు కన్‌ఫామ్‌ చేసేసుకున్నారు. అయితే, చిత్ర యూనిట్‌ నుండి అఫీషియల్‌గా కన్‌ఫామేషన్‌ రావల్సి ఉంది. నిరంజన్‌ రెడ్డితో కలిసి రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారు. ఓ సాంగ్‌తో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS