తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోందంటూ వార్తలు వినిపించాయి. అయితే 'మహానటి' సినిమా తర్వాత సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ పేరు వెలుగులోకి వచ్చింది.
లేటెస్టుగా ఈ విషయంపై త్రిష స్పందించింది. ఆ ఛాన్స్ తనకి వస్తే రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించనని చెప్పింది త్రిష. జయలలితకు వీరాభిమానిని నేను. అలాంటి అవకాశం తనని వరిస్తే, అస్సలు వదులుకోను అని త్రిష చెప్పింది. మరో పక్క ఓ ప్రముఖ నిర్మాత జ్యోతికను సంప్రదించారట జయలలిత పాత్ర కోసం. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత ఓ ప్రభంజనం. సినీ నటిగానూ తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు.
తాజా గాసిప్స్ ప్రకారం త్రిష లేదా జ్యోతిక ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం ఉంది. జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ ఈ రెండు పాత్రలు ఒకదానికొకటి అత్యంత సన్నిహిత సంబంధాలున్న పాత్రలు. ఆమె జీవిత గాధలో ఈ రెండు పాత్రలకు అత్యంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి, ఏమో ఈ ఇద్దరూ కలిసి నటించినా నటించొచ్చు.
చూడాలి మరి. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్న సీనియర్ హీరోయిన్లు త్రిష, జ్యోతిక. తమిళ నాట మంచి మంచి స్టోరీలు ఎంచుకుంటూ, సక్సెస్‌ల మీద సక్సెస్‌లతో జోరు ప్రదర్శిస్తున్నారు వీరిద్దరూ. చూడాలి మరి జయలలిత బయోపిక్ వీరిద్దరిలో ఎవరి చేతికి చిక్కుతుందో. లేక ఇద్దరికీ దక్కనుందో.