సంగీతం గురించి ఎంత బాగా చెప్పారో..

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్‌ని అభిమానులు మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటారు. నిజంగానే ఆయ‌న మాట‌లు ఓమ్యాజిక్‌లా ప‌నిచేస్తాయి. సినిమాల్లోనే కాదు, బ‌య‌ట వేడుక‌ల్లో మాట్టినా ఆయ‌న ప్ర‌సంగాల్లో ఓ ఛ‌మ‌క్కు ఉంటుంది. 'అల వైకుంఠ‌పుర‌ములో' ఫంక్ష‌న్‌లో త్రివిక్ర‌మ్ స్పీచ్ ఎప్ప‌టిలానే హైలెట్‌గా నిలిచింది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న సంగీతం గురించి, పాట గురించి మాట్లాడుతున్న‌ప్పుడు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ మాట‌లే ఇప్పుడు సోష‌ల్ మీడియా అంతా వినిపిస్తున్నాయి. చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

''ఓ పాట మ‌న‌కు ఊతం చేయి ప‌ట్టుకుని న‌డ‌వొచ్చు.. ఓ పాట మ‌న‌కు స్నేహితురాలు మ‌న క‌ష్టాలు చెప్పుకోవచ్చు. అది మ‌న ప్రేయ‌సి త‌న ఒళ్లో మ‌న త‌లను పెట్టుకుని ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు. మ‌న గురువు.. మ‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు జ్ఞానాన్ని బోధిస్తుంది అలాంటి పాట‌ను ఇచ్చిన వారిని గౌర‌వించాల‌నిపించింది. అందుకే దీనికి మ్యూజిక‌ల్ నైట్ పేరు పెట్టి కండ‌క్ట్ చేశాం. మ‌న‌సుకు దుర‌ద పుడితే... గోక్కునే దువ్వెన సంగీతం'' అంటూ చ‌మ‌త్క‌రించారు త్రివిక్ర‌మ్‌.

 

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ''జులాయిలో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రిగా త‌న తాలూకు మెచ్యూరిటీని త‌న మాట‌లు, జీవితంలో, ప‌నిలో ప్ర‌తి దాంట్లో పెడుతున్నాడు. ఈ సినిమాకు మొద‌లు, చివ‌ర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న‌ప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్ప‌టి నుండి 11 నెల‌లు పాటు ఈ జ‌ర్నీ చేశాం. ఆయ‌న లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను. ఆ ప్ర‌యాణంలో మేం కూడా భాగ‌మ‌వుతాం. మేం ప‌నిచేయ‌లేని సినిమాల‌కు మేం సాక్షుల‌మ‌వుతాం, ప్రేక్ష‌కుల‌మ‌వుతాం. మేం ప‌నిచేసే సినిమాల‌కు ద‌ర్శ‌కుల‌మ‌వుతాం. అంద‌రి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి. 12న క‌లిసి పండ‌గ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠ‌పుర‌ములో మీకు స్వాగతం ప‌లుకుతుంది'' అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS