త్రివిక్రమ్‌ మనసులో ఏముందంటే.?

మరిన్ని వార్తలు

'అల వైకుంఠపురములో..' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో త్రివిక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌పై కాన్ఫిడెంట్‌గా దృష్టి పెడతాడు. అయితే, ఈ సారి త్రివిక్రమ్‌తో వర్క్‌ చేసే అదృష్టం ఏ హీరోని వరిస్తుందా.? అనే సస్పెన్స్‌ అందరిలోనూ నెలకొంది. హీరోలైతే రెడీగా ఉన్నారు. మహేష్‌, ప్రబాస్‌, ఎన్టీఆర్‌.. పేర్లు త్రివిక్రమ్‌ లిస్టులో ఉన్నాయి. అయితే, 'సరిలేరు..' తర్వాత మహేష్‌ బెర్త్‌ బుక్‌ చేసేసుకున్నాడు. వంశీ పైడిపల్లితో సినిమాని అనౌన్స్‌ చేసేశాడు. సో మహేష్‌ని పక్కన పెట్టేస్తే, ఇక మిగిలిన ఎన్టీఆర్‌.. ఆల్రెడీ 'అరవింద సమేత..'లో కలిసి వర్క్‌ చేశాడు.

 

ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఇంతవరకూ త్రివిక్రమ్‌ టచ్‌ చేయని హీరో ప్రబాస్‌. ప్రబాస్‌ కోసం తన స్టైల్‌లో ఓ జోనర్‌ని ఆల్రెడీ త్రివిక్రమ్‌ సిద్ధం చేశాడనే టాక్‌ గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ప్రబాస్‌ ప్రస్తుతం 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణతో 'జాన్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పూర్తి కావస్తోంది. సో ప్రబాస్‌నే త్రివిక్రమ్‌ ఫైనల్‌ చేస్తాడనే ప్రచారం ఉంది. అంతేకాదు, తన మేకింగ్‌లో ప్రబాస్‌ హీరోగా అంటే, ఆడియన్స్‌కి కొంచెం ఫ్రెష్‌ ఫీల్‌ క్రియేట్‌ అయ్యే ఛాన్స్‌ కూడా లేకపోలేదు. సో త్రివిక్రమ్‌ ఓటు ప్రబాస్‌కే అనుకోవాలి. ఇకపోతే, 'బాహుబలి' తర్వాత ప్రబాస్‌ నుండి వచ్చిన 'సాహో' షాకింగ్‌ రిజల్ట్‌ మిగిల్చింది. ఇక రానున్న 'జాన్‌'పై ఎలాంటి అంచనాలు క్రియేట్‌ కాలేదింతవరకూ. త్రివిక్రమ్‌ - ప్రబాస్‌ కాంబో వర్కవుట్‌ అయితే, ఆడియన్స్‌లో ఆ అంచనాల రేంజ్‌ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటుందనడం అతిశయోక్తి కాదేమో. చూడాలి మరి, ఈ కాంబో వర్కవుట్‌ అవుతుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS