బ్ర‌హ్మీ - త్రివిక్ర‌మ్‌.. ప్యాచ‌ప్ జ‌రిగిపోయిందా?

మరిన్ని వార్తలు

ఇది వ‌ర‌కు త్రివిక్ర‌మ్ రాసిన ప్ర‌తి క‌థ‌లోనూ బ్ర‌హ్మానందానికి చోటు ఉండేది. ద‌ర్శ‌కుడిగా మార‌క కూడా ఆ ప‌ద్ధ‌తి కొన‌సాగింది. అత‌డు, ఖ‌లేజా, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, జులాయి....ఇలా త్రివిక్ర‌మ్ మంచి పాత్ర‌లే ఇచ్చాడు. కానీ ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలీదు గానీ.. బ్ర‌హ్మానందాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. అఆ, అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత చిత్రాల‌లో బ్ర‌హ్మానందం ఎక్క‌డా క‌నిపించ‌డు.

 

కొత్త‌త‌రం హాస్య‌న‌టుల వైపు మొగ్గు చూపించిన త్రివిక్ర‌మ్, సీనియ‌ర్ల‌కు టాటా చెప్పేశాడు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ బ్ర‌హ్మానందాన్ని త‌న సినిమా కోసం తీసుకున్నాడు ఈ మాట‌ల మాంత్రికుడు. త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో `అల వైకుంఠ‌పురములో` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ్ర‌హ్మీ క‌నిపించ‌బోతున్నాడు. అయితే బ్ర‌హ్మీ ఎంట్రీ ఓ పాట‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశాడు.

 

ఓ ఫ్యామిలీ సాంగ్ లో ఈ సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ క‌నిపించ‌బోతున్నాయి. ఆ పాట‌ని బ్ర‌హ్మానంద‌మే లీడ్ చేస్తాడ‌ని, ఈ పాట చాలా ఫ‌న్నీగా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఆ విధంగా బ్ర‌హ్మానందం - త్రివిక్ర‌మ్ మ‌ధ్య మ‌ళ్లీ ప్యాచ‌ప్ జరిగిపోయిన‌ట్టే అనుకోవాలి. రాబోయే త్రివిక్ర‌మ్ సినిమాల్లో బ్ర‌హ్మానందానికి పూర్తి స్థాయి హాస్య పాత్ర‌లు ద‌క్కుతాయేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS