యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాలో రామ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారనీ సమాచారమ్. ఆ ఇద్దరూ మరింకెవరో కాదు, 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో 'సిరి - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్' అంటూ తన అల్లరి చేష్టలతో ఎట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మ నభా నటేష్ ఒకరు కాగా, మరో భామ అక్కినేని హీరోయిన్ నిధి అగర్వాల్ అని ప్రచారం జరుగుతోంది.
ఎంట్రీలోనే అక్కినేని హీరోలతో వరుసగా జత కట్టింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. చైతూతో నటించిన 'సవ్యసాచి'తో సక్సెస్ అందుకోలేకపోయింది. రెండో సినిమా అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన రిజల్ట్ అందించలేదీ భామకి. కానీ కుర్రకారును తన గ్లామర్‌తో గిలిగింతలు పెట్టించింది. అయినా అవకాశాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదిప్పుడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే.
అదే చేస్తోందట నిధి అగర్వాల్. డిఫరెంట్ ఫీచర్స్‌తో అన్‌లిమిటెడ్ గ్లామర్‌తో గాలం వేస్తోంది. అలాగే నభా నటేష్ కూడా 'నన్ను దోచుకుందువటే', తర్వాత రవిబాబు 'అదుగో'లో నటించింది. రెండు సినిమాలూ సక్సెస్ పరంగా చెప్పుకోదగ్గ హిట్స్ కావు. కానీ హీరోయిన్‌గా తనదైన శైలి టాలెంట్ ప్రదర్శించింది. సో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్ని 'ఇస్మార్ట్ శంకర్' కోసం ఎంచుకునే యోచనలో పూరీ అండ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.