కరోనాతో నెలల తరబడి మూత బడ్డ ధియేటర్లు సంక్రాంతికి అరకొరగా తెరుచుకున్నాయి. 'సోలో బతుకే సో బెటర్' సినిమాతో ధియేటర్ సినిమాలు బోనీ కొట్టాయి. అలా సంక్రాంతికి మాస్ రాజా రవితేజ 'క్రాక్', రామ్ 'రెడ్' తమిళ హీరో విజయ్ 'మాస్టర్', యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' తదితర చిత్రాలు సంక్రాంతి బరిలో సందడి చేశాయి. కానీ, సినిమా సందడి మొదలయ్యిందనడానికి ఈ వెయిట్ చాలదు కదా. అందుకే అసలు సిసలు సందడి ఇప్పుడు మొదలు కానుంది.
ఆగస్టు తర్వాత అసలు సినిమాలు పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ప్రకటించి, సినీ ప్రియుల్లో ఉత్సాహం నింపాడు దర్శక ధీరుడు రాజమౌళి. దసరా బరిలో అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్' ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక లేటెస్ట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రం కూడా రిలీజ్ డేట్ కన్‌ఫామ్ చేసుకుంది. ఆగస్టు 13న 'పుష్ప' ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ, బన్నీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
మరోపక్క మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కొత్త సినిమా ‘గని’ జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు. ఇంకేముంది అసలు సిసలు పండగ మొదలయినట్లే. ఇప్పటికయితే ఇవే లైన్‌లో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', చిరంజీవి 'ఆచార్య' కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇది కదా అసలు సిసలు సినిమా పండగ.