కంగనా ఆదర్శమంటోన్న హాట్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినీ రంగంలోకి వచ్చి బాలీవుడ్‌ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న కంగనా తనకు ఆదర్శమంటోంది బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతెల్లా. మోడలింగ్‌ రంగం నుండి వచ్చి హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే నెక్స్ట్‌ లెవల్‌ ఛాన్సెస్‌ని అందుకుంటోంది ఊర్వశీ రౌతెల్లా. ఈమె అందానికి పిచ్చెక్కని మగవాళ్లుండరు. అసూయ చెందని ఆడవాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదేమో. కానీ అవకాశాలు మాత్రం ఆచి తూచి వస్తుంటాయి ఈ ముద్దుగుమ్మకి. 'హేట్‌ స్టోరీ 4'లో బోల్డ్‌ రోల్‌ పోషించి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 

 

అయితే ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో కాస్త బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌ సినిమాలపై కూడా దృష్టి పెట్టిందట. అయితే మంచి ఛాన్స్‌ వస్తేనే సౌత్‌ సినిమాలను ఎంచుకుంటానని చెబుతోంది. ముఖ్యంగా హీరోయిన్‌గా తానీ రంగాన్ని ఎంచుకున్నప్పుడే ఫిక్సయిపోయిందట, ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవాలని. ఎలాంటి సందర్భంలోనూ లిమిట్స్‌ పెట్టుకోకూడదనీ డిసైడ్‌ అయిపోయిందట. ఆ రకంగానే కెరీర్‌ని మెల్ల మెల్లగా బిల్డప్‌ చేసుకుంటూ వస్తోన్న ఊర్వశీ రౌతెల్లా ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా గడుపుతోంది. 

 

చేతి నిండా పని ఉంటేనే మనసు ఇతర విషయాలపైకి మళ్లకుండా ఉంటుందనే ఫిలాసఫీ చెబుతోందీ హాట్‌ బ్యూటీ. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా టాలీవుడ్‌ నుండి అమ్మడికి ఓ ఆఫర్‌ వచ్చిందట. ప్రముఖ యంగ్‌ హీరో ఆ సినిమాలో నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఊర్వశిని సంప్రదిస్తున్నారనీ తెలుస్తోంది. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి, త్వరలోనే క్లారిటీ రానుందనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారమ్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS