ఓ వైపు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మరోవైపు వైఎస్‌ 'యాత్ర'.!

మరిన్ని వార్తలు

వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ఫస్ట్‌లుక్‌ వచ్చాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు నెక్ట్స్‌ లెవల్‌కి చేరుకున్నాయి. ఇకపోతే అంచనాలు రేపుతున్న మరో బయోపిక్‌ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'యాత్ర'. ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ ముమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం ముమ్ముట్టి ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఆ శ్రద్ధ కనిపిస్తుందట. 

 

ముమ్ముట్టికి తెలుగు భాషపై అంతగా పరిజ్ఞానం లేదు. కానీ ఈ సినిమాలో వైఎస్‌ పాత్ర తననెంతో ఇన్‌స్పైర్‌ చేసిందనీ అందుకే ఆ పాత్ర కోసం తానే డబ్బింగ్‌ చెప్పాలనీ నిర్ణయించుకున్నారు ముమ్ముట్టి. అందులో భాగంగానే షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న యాత్ర ప్రస్తుతం డబ్బింగ్‌ పనుల్లో బిజీగా ఉంది. వైఎస్‌ పాత్రలో ముమ్ముట్టి అప్పియరెన్స్‌తో ఆల్రెడీ ఆకట్టుకుంటున్నారు. ఇక డబ్బింగ్‌ పరంగా కూడా మార్కులు కొట్టేసేలానే ఉన్నారు. ఆయన సొంత గొంతుతో వైఎస్‌ని తలపించేలానే ఉన్నారు. 

 

తాజాగా ముమ్ముట్టి డబ్బింగ్‌ చెబుతున్న మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఆనందో బ్రహ్మ' ఫేం మహి.వి. రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS