దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ త్వరలోనే తండ్రి స్థానంలో కన్యాదానం చేయబోతున్నారు. వెంకటేష్ కుమార్తె పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్లో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. మార్చి 1న వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులూ నిర్ణయించారు. వరుడు హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ అయిన సురేందర్ రెడ్డి మనవడు.
ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లికి చాలా తక్కువ మంది అతిథులకు ఆహ్వానాలు అందబోతున్నాయని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారట. వివాహ విందు మాత్రం ఘనంగా చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్లోని నానక్రామ్ గుడాలో ఉన్న రామానాయుడు స్టూడియోలో విందు ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.