ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్ తనయగా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్‌కుమార్ తమిళంలో హీరోయిన్‌గా పలు గ్లామర్ పాత్రలు పోషించి, ఇప్పుడు విభిన్న తరహా పాత్రలను ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్ని కూడా టార్గెట్ చేసింది.
'పందెం కోడి 2' తదితర సినిమాలు తెలుగులో విడుదలై మంచి విజయం అందుకోవడంతో, ఆ సినిమాల్లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లో కనిపించి వరలక్ష్మీ తెలుగు ప్రజల అపారమైన అభిమానాన్ని అందుకుంది. డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు ఆశక్తి చూపిస్తోంది వరలక్ష్మి. కథను బట్టి విలన్‌గా ఆమెకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ అయితే తెలుగులోనూ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మికి వింత అనుభవం ఎదురైంది. అంతకన్నా ముందు, విశాల్‌తో వరలక్ష్మికి ఉన్న అనుబంధం గురించి గతంలో పలు వార్తలు విన్నాం. సరే అయితే విశాల్ విషయంలో వరలక్ష్మి అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట ఇప్పుడు. ఒకప్పుడు లవ్ చేస్తానన్న వరలక్ష్మి, ఇప్పుడు విశాల్‌ని చంపేస్తానంటోంది.. ఇంటర్వ్యూలో ఓ విలేఖరి ఫన్నీగా అడిగిన ప్రశ్నకు అంతే ఫన్నీగా వరలక్ష్మి ఇచ్చిన సమాధానమిది. వరలక్ష్మి ఏమంత తెలివితక్కువది కాదులెండి. భలే గడుసుపిల్లే మరి.!