హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి, ఇప్పుడు ఇంపార్టెంట్ అండ్ పవర్‌ఫుల్ రోల్స్‌తోనూ, విలన్ పాత్రలతోనూ మెప్పిస్తోన్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ మస్త్ గుస్సా అయ్యింది. ఆమె గుస్సాకి కారణమేంటంటారా.? పెళ్లి వార్త. గతంలోనే వరలక్ష్మి, తాను పెళ్లి చేసుకోననీ, ఒకవేళ చేసుకోవల్సి వస్తే, అది ఇప్పుడప్పుడే కాదనీ ఆమె పక్కా క్లారిటీతో చెప్పేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా సంస్థ త్వరలో వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతోందనే వార్త ప్రచురించింది.
ఈ వార్తకు గుస్సా అయిన వరలక్ష్మి శరత్‌కుమార్, 'ఎన్నిసార్లు చెప్పాలి, నేను పెళ్లి చేసుకోననీ, అయినా నా పెళ్లి విషయం పూర్తిగా నా పర్సనల్.. ఇలాంటి పర్సనల్ విషయాల్లో గాలి వార్తలు ఎలా పుట్టిస్తారంటూ..' వరలక్ష్మి స్పందించింది. అసలే లేడీ విలన్. అందులోనూ మాట చాలా ఘాటు. అలాంటి వరలక్ష్మితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది.
ఇటీవల తమిళ సినిమాలతో పాటు, తెలుగులోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న 'తెనాలి రామకృష్ణ' సినిమాలో విలన్‌గా నటిస్తోంది ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది.