హాట్‌ హాట్‌ సొగసుల 'ఆఫీసరమ్మ'.!

మరిన్ని వార్తలు

వర్మ కంపెనీ నుండి దిగుమతి అయిన హాట్‌ భామ మైరా సరీన్‌. 'ఆఫీసర్‌' సినిమా కోసం ఈ హాట్‌ బ్యూటీని పరిచయం చేశాడు రామ్‌గోపాల్‌ వర్మ. తొలి సినిమాకే ఆమె నటనా చాతుర్యాన్ని చూసి వర్మ తెగ ఇంప్రెస్‌ అయిపోయారు. ఆ సినిమా టైంలో ప్రశంసల వర్షం కురిపించేశారు మైరా సరీన్‌పై. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. అసలు 'ఆఫీసర్‌' అనే సినిమా వచ్చిందీ వెళ్లిందీ అనే విషయమే ఆడియన్స్‌కి గుర్తు లేకుండా పోయింది. 

 

దాంతో ఈ హాట్‌ భామ ఘాటు సొగసులకు అర్ధం లేకుండా పోయింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. సోషల్‌ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మైరా సరీన్‌ ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. స్కిన్‌ టోన్‌కి మ్యాచ్‌ అయ్యేలా బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో కళ్లకు ఎల్లో కలర్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని మైరా తాను ఎటో చూస్తూ మనల్ని మాత్రం తననే చూసేలా మాయ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS