ఆగండాగండీ వర్మ మాజీ ప్రియురాలు అంటే.. ఏ శ్రీదేవినో, ఊర్మిళనో లేక ఏ మహేశ్వరినో ఊహించుకోకండి. అసలీ వర్మ గారు మన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కానే కాదు మరి. అయితే ఎవరీ వర్మ అంటే.. తమిళ అర్జున్‌రెడ్డి సినిమాకి మొదట్లో 'వర్మ' అనే టైటిల్‌ని అనుకున్నారు. అయితే టెక్నికల్ కారణాలతో ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయాక ఆగిపోయింది.
ఆ తర్వాత 'ఆదిత్య వర్మ'గా పేరు మార్చుకుని మరోసారి తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మొదటి 'వర్మ'కు హీరోయిన్గా నటించింది బెంగాలీ ముద్దుగుమ్మ మేఘా చౌదరి. పాపం సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం, రీ షూట్ చేసుకోవడంతో, ఈ రీ షూట్లో ఈ పాపను పక్కన పెట్టేశారు. కొత్త 'ఆదిత్య వర్మ' కోసం మరో ముద్దుగుమ్మ బనితా సందును ఎంపిక చేసుకున్నారు. సరే ప్రస్తుతానికి ఈ మ్యాటర్ అంతా పక్కన పెట్టేద్దాం.
ఈ బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరికి తమిళంలో 'వర్మ'తో ఆడి పాడే ఛాన్స్ తప్పినా, తెలుగులో సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణతో ఆడి పాడే ఛాన్స్ దక్కింది. బాలాజీ సనాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమా కోసం మేఘా చౌదరిని హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా.? 'ఊరంతా అనుకుంటున్నారు'. హమ్మయ్యా.! ఇప్పుడు అసలు మ్యాటర్ అర్ధమైపోయుంటుంది కదా. అదీ సంగతి.