'కాంచన'కు 'యు బై ఏ' సర్టిఫికెట్‌ ఇచ్చారండోయ్‌.!

మరిన్ని వార్తలు

ముని సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే హారర్‌ లేదంటే కామెడీ.. అంతవరకూ తెలిసిందదే ప్రేక్షకులకి. కానీ  'ముని' సిరీస్‌తో హారర్‌ కామెడీ అనే కొత్త ట్రెండ్‌ని పరిచయం చేశాడు రాఘవ లారెన్స్‌. చిన్నా, పెద్దా.. భయపడకుండా హారర్‌ సినిమాల్ని చూసేలా హారర్‌కి కామెడీ టచ్‌ ఇచ్చి కొత్త ఒరవడితో సక్సెస్‌ అయ్యి చూపించాడు లారెన్స్‌ రాఘవ.

 

త్వరలో ఆ ముని సిరీస్‌లో 'కాంచన 3' రాబోతోంది. లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాని చూసి ప్రశంసల జల్లు కురిపించారు. 'యు బై ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. 

 

అంటే 'కాంచన 3'ని సకుటుంబ సపరివారంగా అందరూ చూడొచ్చన్నమాట. ఈ సిరీస్‌లో గత చిత్రాలను మించి ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే, లారెన్స్‌ గెటప్‌. లారెన్స్‌ గెటప్‌కే మంచి రెస్పాన్స్‌ దక్కుతోంది. ఓవియా, వేదిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ముని' మొదటి సిరీస్‌ నుండీ లారెన్స్‌కి తల్లిగా నటిస్తున్న కోవై సరళ ఈ సిరీస్‌లోనూ నటిస్తుండడం విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS