ఆ స్టార్‌ హీరో తనయుడికే ఇలా జరగాలా.?

By Inkmantra - April 10, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

తెలుగులో సంచలన విజయం అందుకున్న అర్జున్‌ రెడ్డి సినిమాని హిందీతో పాటు, తమిళంలో కూడా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ అర్జున్‌రెడ్డి 'కబీర్ సింగ్' సంగతి సరే.. జూలైలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్‌గా టీజర్‌ కూడా వదిలేశారు. ఫ్లేవర్‌ కూడా తెలిసిపోయింది. ఇక తమిళ అర్జున్‌రెడ్డి సంగతేంటటా.? అంటే పాపం తమిళ అర్జున్‌రెడ్డి విషయంలో చాలా నేరాలూ ఘోరాలే జరిగాయి. 

 

'ఆదిత్యవర్మ' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎప్పుడో 'వర్మ' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయాల్సి ఉంది. సీనియర్‌ డైరెక్టర్‌ బాలా దర్శకత్వంలో సీనియర్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇక విడుదలకు రెడీ అయిన టైంలో సినిమా నచ్చలేదంటూ కాన్సిల్‌ చేయడం అప్పట్లో పెద్ద రచ్చయ్యింది. ఆ రచ్చ ఎలాగోలా ముగిసిందనుకుంటే, తాజాగా మరోసారి ఈ సినిమా చుట్టూ గాసిప్స్‌ అల్లుకున్నాయి. 

 

ఈ సినిమా కూడా ఆగిపోయిందట అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ చిత్ర నిర్మాత ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ లాస్ట్‌ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం పాట షూటింగ్‌ నిమిత్తం పోర్చుగల్‌లో 'ఆదిత్య వర్మ' టీమ్‌ సందడి చేస్తోందనీ ఆయన తెలిపారు. సందీప్‌ రెడ్డి వంగా అసిస్టెంట్‌ గిరి శ‌య్య‌ ఈ సినిమాకి దర్శకుడు. ముద్దుగుమ్మ బనితా సందు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS