సినీపరిశ్రమలో నటీమణులకి వేధింపులు అన్నది సర్వసాధారణంగా వినిపించే మాట. అయితే ఇలాంటి అనుభవం బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరోకి ఎదురవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, వరుణ్ ధావన్ కి ఈమధ్య ఒక యువతి తరుచూ ఫోన్ చేయడం మెసేజ్ చేస్తుండడంతో ఆమెకి ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి సదరు ఫోన్ నంబర్ ని బ్లాక్ చేసాడు. ఇలా జరిగిన తరువాత మరుసటి రోజు వేరే ఫోన్ నంబర్ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడకపోతే తను ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్పడంతో వెంటనే వరుణ్ సాంటా క్రూజ్ పోలీసు స్టేషన్ లో ఈ అంశం పై ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు తో పాటు వారు ఏ ఫోన్ నంబర్స్ నుండి అయితే ఫోన్ చేసారో వాటిని పోలీసులకి అందచేయడంతో వారు వెంటనే ఎవరు ఈ పనిచేసారు అన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
ఏదేమైనా.. హీరోకి ఇలాంటి వేధింపులకి గురవ్వడం విచిత్రంగా ఉంది.