చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. వీళ్లంతా ఓ తరం హీరోలు. ఇప్పటికీ హీరోలుగానే కొనసాగుతున్నారు. గతంతో పోలిస్తే చిరు, బాలయ్య స్పీడు పెంచారు. రెండు మూడు ప్రాజెక్టులు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. నాగ్ కూడా ఖాళీగా లేడు. ప్రతీ సీజన్‌లోనూ ఏదో ఓ సినిమా వస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ ఎలాగూ ఉంది. అయితే వెంకటేష్ మాత్రం బాగా స్లో అయిపోయాడు. సినిమా సినిమాకీ గ్యాప్ బాగా వచ్చేస్తోంది. చేసినా రీమేకులనే ఎక్కువ నమ్ముతున్నాడు. ఎఫ్ 3 రిలీజ్ అయి, ఇన్ని రోజులైనా.. తదుపరి సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు.
తరుణ్ భాస్కర్‌తో వెంకీ ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. దాదాపుగా ఆ సినిమా లేనట్టే అని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో కథ ఓకే అయ్యింది. అయితే.. అనుదీప్ ప్రస్తుతం శివకార్తికేయన్ తో `ప్రిన్స్` సినిమా చేస్తున్నాడు. అది పూర్తయితే తప్ప వెంకీ సినిమా సెట్స్‌పైకి వెళ్లదు. అప్పటి వరకూ వెంకీ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. వెంకటేష్‌కి కథల కొరత కూడా ఉంది. తనకు ఏ కథా త్వరగా నచ్చదు. అందుకే... వెంకీ ఇప్పుడు పూర్తిగా రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు.