వెంకీ మామ ఫస్ట్ లుక్ రిలీజ్

By iQlikMovies - April 06, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న `వెంకీ మామ` సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా కథానాయికలు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు . ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత. 

 

వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకటేష్ నాగ చైతన్య నవ్వుతూ కనిపించడం అభిమానుల్లో నిజమైన పండుగ వాతావరణాన్ని తెచ్చింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బావుందని అక్కినేని, దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంకీ మామ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి హైదరాబాదులో తాజా షెడ్యూల్ మొదలుకానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS