గ్లామ్‌షాట్‌: ఛమక్‌ ఛమక్‌ 'ఇస్మార్ట్‌' హాటీ లుక్‌.!

By Inkmantra - April 08, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌'లో ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా నిధి అగర్వాల్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్పెషల్‌ ఫోటో షూట్‌ కోసం తీయించుకున్న ఫోటోలు కావివి. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో ఓ సాంగ్‌కి సంబంధించి నిధి అగర్వాల్‌ స్టిల్స్‌. సోషల్‌ మీడియాలో కెవ్వుకేక పుట్టిస్తున్నాయి ఈ తాజా స్టిల్స్‌. 

 

నిధి అగర్వాల్‌లో ఎట్రాక్టివ్‌ బ్యూటీనెస్‌తో పాటు, ఇస్మార్ట్‌ డాన్సింగ్‌ టాలెంట్‌ కూడా ఉంది.. ఛమక్‌ ఛమక్‌ మెరూన్‌ కాస్ట్యూమ్‌లో ఈ డాన్సింగ్‌ డాళ్‌ స్టెప్పులు కుర్రోళ్లకు చక్కిలిగింతలు పెడుతున్నాయి. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో రామ్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇంతవరకూ తెలుగులో నిధి నటించిన రెండు సినిమాల్లోనూ డాన్సులకు పెద్దగా స్కోప్‌ లేదు. కానీ ఈ సినిమాలో పూరీ, నిధితో ఇరగదీసే మాస్‌ స్టెప్పులేయించాడనడానికి ఈ స్టిల్సే ఎగ్జాంపుల్‌. రామ్‌ - నిధి కాంబినేషన్‌లో డాన్సింగ్‌ విశ్వరూపం చూడాలంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. అంతవరకూ ఈ స్టిల్స్‌ చూసి ఫెస్టివల్‌ చేసుకోండి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS