అచ్చమైన సంక్రాంతి సినిమా ఈ రోజే వచ్చింది. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ' కంటే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఎక్కువ హోప్స్ 'ఎఫ్ 2' మీదనే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే 'ఎఫ్ 2' ఫస్ట్ డే ఫస్ట్ షోతో 'ఫన్'టాస్టిక్ టాక్ తెచ్చుకుంది. సెకండాఫ్ కొంచెం స్లో అయ్యింది అనే వాదన వున్నా, ఓవరాల్‌గా అన్ని రివ్యూలు ఈ సినిమాకి మంచి రేటింగ్సే ఇచ్చాయి.
వెంకటేష్, వరుణ్‌తేజ్ తోడల్లుళ్లుగా బోలెడంత ఫన్ జనరేట్ చేశారు. ఈ ఇద్దరిలో వెంకీదే టాప్ చైర్. గ్లామర్ విషయానికి వస్తే, మెహ్రీన్‌ని తమన్నా డామినేట్ చేసింది. అందంతోనూ, నటనతోనూ, డాన్సులతోనూ తమన్నా అదరగొట్టేస్తే, మెహ్రీన్ క్యూట్‌గా ఆకట్టుకుంది. అసలు సిసలు సంక్రాంతి సినిమా ఇప్పుడే వచ్చిందంటూ ఆడియన్స్ ఊరట చెందుతున్నారు.
'ఎన్టీఆర్ కథానాయకుడు' వసూళ్లు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. 'వినయ విధేయ రామ' నష్టాల బారి నుండి తప్పించుకోలేదు కానీ, కాస్తైనా ఆ నష్టాన్ని తగ్గించుకోగలదేమో సంక్రాంతి తర్వాత తెలుస్తుంది. అనిల్ రావిపూడి మరోసారి తనదైన స్టైల్ చూపించాడు.