ఈ సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చిన సినిమాల్లో 'వినయ విధేయ రామ' ఒకటి. ఈ సీజన్లో భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. చరణ్ - బోయపాటి తొలిసారి ఓ సినిమా చేశారు. అందుకే ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే తొలిరోజు రూ.26 కోట్లతో బాక్సాఫీసుని షేక్ చేసింది 'వినయ విధేయ రామ'. చరణ్ కెరీర్లో తొలిరోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఇదొకటి.
నైజాంలో 5 కోట్లు, సీడెడ్‌లో ఏకంగా 7 కోట్లు తెచ్చుకుని బాక్సాఫీసు దగ్గర జోరు పెంచింది 'వినయ విధేయ రామ'. ఈస్ట్, వెస్ట్ కలిసి దాదాపు 4 కోట్లు సాధించింది. గుంటూరులో రూ.4.2 కోట్లు తెచ్చుకుంది. టాక్ పరంగా `ఫ్టాప్` అనిపిస్తున్నా, ఈ సంక్రాంతి పోటీ ఎక్కువై.. కావల్సినన్ని థియేటర్లు దొరక్కపోయినా తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం రికార్డే. రెండోరోజు కూడా ఈ జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు బుకింగుల వల్ల.. సినిమా ఎలా ఉన్నా సరే, థియేటర్లు నిండే ఛాన్స్ ఉంది.