ఛలో, భీష్మ చిత్రాలతో ఆకట్టుకున్నాడు వెంకీ కుడుముల. మూడో సినిమా ఓ పెద్ద హీరోతో చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. మహేష్‌బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలకు టచ్‌లో వెళ్లాడు. వాళ్లకూ.. వెంకీ కుడుముల చెప్పిన కథలు నచ్చినా - వెంటనే సినిమాలు చేయడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఎవరి కమిట్‌మెంట్స్ లో వాళ్లున్నారు. కాబట్టి.. వెంకీకి ఎదురు చూపులు, నిరీక్షణలు తప్పడం లేదు.
మళ్లీ యధావిధిగా యంగ్ హీరోల బాట పట్టాడు. త్వరలోనే వెంకీకుడుముల వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేసే ఛాన్సుందని సమాచారం. ఇటీవల వెంకీ, వరుణ్‌ల మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని, ఇద్దరూ కలిసి పనిచేయడానికి ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ప్రస్తుతం `గని`, `ఎఫ్ 2`లతో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఇవి రెండూ ముగిసిన వెంటనే వెంకీ కుడుమల సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.