వెంకీ, వరుణ్‌తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ 2'. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ టాక్‌తో దుమ్ము దులిపేస్తోంది 'ఎఫ్ 2'. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ దర్శకుడు అనిల్ రావిపూడిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందట. ఆ ఉత్సాహంతోనే ఈ సినిమాని ఇంతటితో ఎండ్ చేయనంటున్నాడు. బాలీవుడ్లో 'గోల్మాల్' మూవీ గుర్తుంది కదా.
ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ. ఆ సినిమాకి ఎన్నో సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయట కూడా. అలాగే ఈ సినిమాకి కూడా సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తాడట అనిల్ రావిపూడి. అంతేకాదు, మన హీరోలు వెంకీ, వరుణ్ కూడా అందుకు ఓకే అనేశారట కూడా. 'ఎఫ్ 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే వరుణ్ చెప్పాడు. వెంకీతో 'ఎఫ్ 2' చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంది. సో ఇంకా ఇంకా ఆయనతో కలిసి సినిమాలు చేసేందుకు తాను రెడీ అన్నాడు.
అంతేకాదు, వెంకీని తన డార్లింగ్‌గా అభివర్ణించాడు. వెంకీతో సినిమా అంటే కథ, తన క్యారెక్టర్ ఏంటీ అనేది కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంటానని అదే వేదికపై మాటిచ్చేశాడు. ఇంకేముంది అనిల్ రావిపూడికి పండగే పండగ. ఈ ఇద్దరు హీరోల్ని పట్టుకుని, 'ఎఫ్ 2'కి ఎన్ని సీక్వెల్స్ తీస్తాడో ఆయనకే తెలియదంట. త్వరలోనే 'ఎఫ్ 3' అయితే వచ్చేస్తుందని స్టే ట్యూన్డ్ అని ఆడియన్స్‌కి భరోసా ఇచ్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.