ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా తెరంగేట్రం చేస్తే పెద్దగా అంచనాలుండవు. లక్కు కలిసొచ్చి సక్సెస్ అయితే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. కానీ బడా బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చే హీరోలకు తొలి సినిమానే కత్తి మీద సామువంటిది. అభిమానుల్లో అనూహ్యమైన అంచనాలుంటాయి. అదే పరిస్థితి నెలకొందిప్పుడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో.
మోక్షజ్ఞను పరిచయం చేసే డైరెక్టర్ ఫలానా అంటే ఫలానా అంటూ గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎవరనేది ఫిక్స్ కాలేదింతవరకూ. తాజాగా ఆ లిస్టులోకి బోయపాటి కూడా వచ్చి చేరారు. కానీ మోక్షజ్ఞను తాను పరిచయం చేయట్లేదని బోయపాటి తేల్చేశారు. దీనికీ ఓ కారణం ఉంది. బోయపాటి - నందమూరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలుంటాయి. తొలి సినిమాకి ఆ స్థాయి అంచనాలు మంచిది కాదనే యోచనలో ఉన్నారట.
అక్కినేని వారసుడు అఖిల్ విషయంలో జరిగినట్లు, మోక్షజ్ఞ విషయంలో జరగకుండా బాలయ్య జాగ్రత్త పడుతున్నారట. అందుకే మంచి కథ కోసం వెతుకుతున్నామనీ, దొరకగానే మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అవుతుందని బాలయ్య చెప్పారు. అది కూడా 2020లో పక్కా అని తెలిపారు. దీన్ని బట్టి, మోక్షజ్ఞ కోసం బాలయ్య కొత్త డైరెక్టర్స్‌ని లైన్లో పెడుతున్నారనీ అర్ధమవుతోంది. కొత్త డైరెక్టర్స్‌పై పెద్దగా అంచనాలుండవు. క్లాస్ టచ్‌తో ట్రెండీ రొమాంటిక్ ఎంటర్టైనర్తో మోక్షజ్ఞ తెరంగేట్రం ఉండనుందన్న మాట.