నటిగా గ్లామర్ తో పాటు అభినయం కూడా పండించిన అతికొద్దిమంది నటీమణులలో విద్యా బాలన్ ఒకరు. హీరోల కోసమే ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు అన్న నానుడిని సరికాదు అంటూ ఆమె చేసిన కొన్ని సినిమాలు నిరూపించాయి. అలాంటిది ఇప్పుడు ఆమె ఒక నిజజీవితం నుండి స్పూర్తిపొందిన ఒక ఆసక్తికర పాత్రలో తెరపైన కనిపించనున్నారు.
ఇంతకి ఆమె తెరపైన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారట. ఇందిరాగాంధీ జీవితం పైన వచ్చిన ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఈ పాత్రని రూపొందించనున్నారట. అయితే దీనిని సినిమాగానా లేక వెబ్ సిరీస్ గా తీస్తారా అన్నదాని పైన ఇంకా క్లారిటీ రావాల్సివుంది.
ఇప్పటికైతే ఈ పుస్తకానికి సంబందించిన రైట్స్ ని విద్యా భర్త అయిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ తీసుకోవడంతో విద్యా బాలన్ ఈ పాత్ర చేస్తున్నది అన్నది కన్ఫర్మ్ అయింది. అయితే ఈ పాత్ర విద్యా బాలన్ చేయబోతున్నది అన్న సంగతి తెలిసి కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
ఇందిరాగాంధీ వంటి పాత్ర చేయాలి అంటే దానికి సరైన అర్హత ఉండాలి అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొంతమంది విద్యా బాలన్ ఈ పాత్ర పోషిస్తే ఈ అంశం పై కోర్టుకి వెళతాము అంటూ కూడా కొందరు బెదిరింపులకి దిగుతున్నారు.