ఈ వారం విడుదలైన చిత్రాల్లో `జాతిరత్నాలు` మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈసినిమా చూస్తున్న ప్రేక్షకుడు రెండు సార్లు షాక్ తిన్నాడు. ఓసారి... కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. చివర్లో విజయ దేవరకొండ కనిపించాడు. వీరిద్దరూ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారన్న సంగతి చిత్రబృందం గోప్యంగా ఉంచగలిగింది. అందుకే... ప్రేక్షకులకు తీయని షాక్ తగిలింది.
అయితే ఈ చిన్న గెస్ట్ రోల్ ని విజయ్ దేవరకొండ ఎందుకు చేశాడో అర్థం కాదు. రౌడీ కనిపించినా.. ఆ సీన్ అంత ఇంపాక్ట్ గా లేదు. కీర్తి సురేష్ తో కొన్ని లవ్ లీ మూమెంట్స్, డైలాగులూ, ఫన్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ సీన్ లో అవేం లేవు. పైగా కావాలని ఇరికించినట్టు ఓ షాట్ లో చూపించారంతే. డైలాగులూ లేవు. పైగా ప్రేక్షకుడు ఏమరపాటుగా ఉంటే, ఆ సీన్లో విజయ్ దేవరకొండ కనిపించిన సంగతి కూడా తెలీదు.
గెస్ట్ రోల్ అంటే ప్రేక్షకుడికి కిక్ ఇవ్వాలి. అంతే తప్ప.. ఎందుకు పెట్టారో అన్నట్టు ఉండకూడదు. మరి ఇలాంటి గెస్ట్ రోల్ ని రౌడీ ఎందుకు చేశాడో?