కొత్త బ్యానర్‌, కొత్త హీరో, కొత్త డైరెక్టర్‌.. బాగుందయ్యా రౌడీ.!

మరిన్ని వార్తలు

'పెళ్లిచూపులు' సినిమాతో డైరెక్టర్‌గా సంచలన విజయం అందుకున్నాడు యంగ్‌స్టర్‌ తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. ఇప్పుడీ సెన్సేషనల్‌ స్టార్‌ హీరో, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇటీవల 'కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌' పేరుతో విజయ్‌ దేవరకొండ నిర్మాణ సంస్థను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ బ్యానర్‌లో తొలి సినిమాని, తనకు హీరోగా సంచలన విజయం అందించిన డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌తో రూపొందిస్తుండడం విశేషం. అంతేకాదు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్‌ సమీర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. షార్ట్‌ ఫిలిం డైరెక్షన్‌ విభాగం నుండి డైరెక్టర్‌గా ప్రమోట్‌ అయిన సమీర్‌ ఈ సినిమాని మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడట. ఈ సినిమాతో తమిళ బుల్లితెర నటి వాణి భోజన్‌ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. విజయ్‌ దేవరకొండ అంటే ఇప్పుడో బ్రాండ్‌.

 

అందుకు తగ్గట్లుగానే నిర్మాతగా తొలి సినిమాని సరికొత్త బ్రాండ్‌తో శ్రీకారం చుట్టబోతున్నాడు. హీరోగా తనకున్న ఇమేజ్‌ని విజయ్‌ దేవరకొండ, నిర్మాతగా ఎలా వాడుకుంటాడో చూడాలి మరి. ఇకపోతే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్నాడు. జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా మండన్నా ఈ సినిమాలో విజయ్‌తో జోడీ కడుతోంది. ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS