విజయ్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌.!

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ స్టార్‌ అంటే విజయ్‌ దేవరకొండ, విజయ్‌ దేవరకొండ అంటే సెన్సేషనల్‌ స్టార్‌ అన్నంతగా పాపులర్‌ అయిపోయింది. 2019 ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30లో నటుడిగా విజయ్‌ దేవరకొండ చోటు దక్కించుకున్నాడు. ఇండియాలో 30 ఏళ్ల లోపు వ్యక్తుల్లో తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ స్థానం దక్కుతుంది. ఈ సంవత్సరానికి గాను నటుడిగా ఆ ఆరుదైన స్థానాన్ని విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు. యూత్‌లో పిచ్చ క్రేజ్‌ ఉన్న నటుడు విజయ్‌ దేవరకొండ. అతి తక్కువ సమయంలో ఇంత క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 

 

నిజానికి వెండితెరకు ఎప్పుడో 2011లోనే సుపరిచితుడైనా 'పెళ్లి చూపులు' సినిమా విజయ్‌ దేవరకొండ కెరీర్‌ టర్న్‌ చేసింది. ఇక 'అర్జున్‌రెడ్డి' స్టార్‌ని చేసేసింది. ఆ తర్వాత విజయ్‌కి తిరుగు లేకుండా పోయింది. గతేడాది 'నోటా' ఫెయిల్యూర్‌ కావడంతో విజయ్‌ పనైపోయిందనుకున్నవాళ్లు కాస్తా, 'ట్యాక్సీవాలా' హిట్‌తో మళ్లీ ఆశ్చర్యపోవడమే వారి వంతైంది. రిలీజ్‌కి ముందే ఫుల్‌ డిజిటల్‌ మూవీ లీకైపోయింది. అలాంటి ఈ సినిమాతో హిట్‌ కొట్టి, భారీ వసూళ్లు సాధించి తన స్టామినా ఏంటో చూపించాడీ రౌడీ. 

 

'రౌడీ' పేరుతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసేశాడు మనోడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులున్నాయి. తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ మనోడు సుపరిచితుడే. విజయ్‌ దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే మనోడి గొప్ప చాలా చాలా ఎక్కువే మరి. ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS