స్టైల్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన కాస్ట్యూమ్స్, కనిపించే విధానం కొత్తగా ఉంటాయి. తెరపై ఎలా ఉన్నా, బయట మాత్రం విజయ్ లుక్ అందరినీ ఆశ్చర్యంలో పడుస్తుంటుంది. తాజాగా విజయ్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. పొడవైన చింపిరి జుట్టు, ఫ్రెంచ్ గడ్డంతో.. విజయ్ కనిపిస్తున్నాడు. ఆ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏదైనా సినిమా కోసం ఇలా మారుతున్నాడా, లేదంటే లాక్ డౌన్ కాబట్టి సరదాగా కొత్త లుక్ ట్రై చేశాడా? అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈలోగా విజయ్ లుక్ పై ట్రోల్స్ కూడా మొదలైపోయాయి. రాకేష్ మాస్టర్ బయోపిక్ ఏమైనా తీస్తున్నావా విజయ్ అంటూ ఓ నెటిజన్ సరదాగా కామెంట్ పెట్టాడు. ఖల్ నాయక్ లో సంజయ్ దత్ లా ఉన్నావంటూ మరో నెటిజన్ జోక్ చేశాడు. మొత్తానికి విజయ్ లుక్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.