సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా.. అంటూ అప్పుడెప్పుడో ప్రకటన వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి సంబంధించిన అప్ డేట్ ఏమీ లేదు. ఈలోగా ఇటు సుకుమార్, అటు విజయ్ దేవరకొండ ఎవరి సినిమాతో వాళ్లు బిజీ. కొత్త సినిమాలు కూడా ప్రకటించేసుకుంటున్నారు. తప్ప.. ఈ కాంబో గురించి మాట్లాడడం లేదు.
రౌడీ ఇప్పుడు లైగర్ చేస్తున్నాడు. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా... పూరితో మరో సినిమా మొదలెట్టేస్తానని ప్రకటించాడు. ఈ కాంబోలో రెండో సినిమా అధికారికంగా మొదలైపోయింది కూడా. ఆ తరవాత శివ నిర్వాణ సినిమా ఉంది. అంటే దాదాపుగా రెండేళ్లు బ్లాక్ అయిపోయినట్టే.
ఇటు సుకుమార్ కూడా అంతే. పుష్ఫ 2 ఇంకా మొదలెట్టలేదు. అదెప్పుడు అవుతుందో తెలీదు. ఆ తరవాత.... చిరంజీవితో ఓ సినిమా ఉండబోతోందని టాక్. అంటే.. మరో రెండేళ్లు ఆయన కూడా ఖాళీగా ఉండడు. అంటే. రెండేళ్ల వరకూ ఈ కాంబో గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. ఈలోగా రాజెవరో, మంత్రెవరో..?