ఫుల్‌ జోష్‌లో రౌడీస్‌.!

By Inkmantra - January 04, 2020 - 09:31 AM IST

మరిన్ని వార్తలు

గతేడాది 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో భారీ అంచనాలతో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమా అంచనాల్ని అస్సలు అందుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది లవర్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' అంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో లేటెస్ట్‌గా వదిలిన టీజర్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ టీజర్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులు రౌడీస్‌లో కొత్త జోష్‌ నింపింది. టీజర్‌లో విజయ్‌ దేవరకొండ రగ్గ్‌డ్‌ లుక్‌ చూసి, ఇది 'అర్జున్‌ రెడ్డి'కి సీక్వెల్‌లా ఉంది. ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది.. అని ఓ అంచనాకి వచ్చేశారు ఓ వర్గం అభిమానులు. విజయ్‌ దేవరకొండ మారాలి. మూస కథల నుండి బయటికి రావాలి.

 

కొంచెం కొత్తగా, భిన్నంగా ట్రై చేయాలి అంటూ మరో వర్గం అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ టీజర్‌ని 'అల వైకుంఠపురములో..', 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా టీజర్స్‌తో పోలుస్తున్నారు వ్యూస్‌ పరంగా. సోషల్‌ మీడియాలో ఆ రేంజ్‌లో ఈ టీజర్‌ వ్యూస్‌ దక్కించుకుంటోంది. దాంతో బన్నీ ఫ్యాన్స్‌, మహేష్‌ ఫ్యాన్స్‌తో రౌడీ ఫ్యాన్స్‌ పోటీ పడుతున్నారు. పోటీ అనే కన్నా ఓ చిన్నపాటి యుద్ధం నడుస్తోంది అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో. మరి, ఈ పోటీని తట్టుకుని, ఈ సారైనా మన రౌడీ సక్సెస్‌ అందుకుంటాడా.? చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS