చిరంజీవికి ఏనుగు బ‌హుమానంగా ఇచ్చారు!

మరిన్ని వార్తలు

ద‌ర్శ‌కుడు క‌థానాయ‌కుడికీ, క‌థానాయ‌కుడు ద‌ర్శ‌కుడికీ బ‌హుమానాలు ఇచ్చుకునే సంప్ర‌దాయం ఎప్ప‌టి నుంచో ఉంది. ఒక‌రిపై ఉన్న ప్రేమ‌ని మ‌రొక‌రు చాటి చెప్పుకోవ‌డానికి చిన్న చిన్న బ‌హుమానాలే తార్కాణంగా నిలుస్తాయి. చిరంజీవి - విజ‌య బాపినీడు మ‌ధ్య ఉన్న అనుబంధం ప్ర‌త్యేకంగా గుర్తు చేయ‌న‌వ‌సరం లేదు. విజ‌య‌బాపినీడు తీసిన స‌గం చిత్రాల్లో చిరునే హీరో. ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండేవారు. 

 

విజ‌య బాపినీడుని నిర్మాత నుంచి ద‌ర్శ‌కుడిగా చేసిన క‌థానాయ‌కుడు చిరంజీవే. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యి వంద రోజుల పండ‌గ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా విజ‌య‌బాపినీడు చిరంజీవికి ఓ ఏనుగుని బ‌హుమానంగా ఇచ్చారు. ఎవ‌రైనా కార్లు, వాచీలు గిఫ్టులుగా ఇస్తారు, మీరేంటి? ఏనుగు ఇచ్చారు? అని చిరంజీవి అడిగితే.. ''మీమీద నాకు ఏనుగంత ప్రేమ ఉంది.. అందుకే ఈ బ‌హుమ‌తి ఇచ్చా. నా ప్రేమ‌కీ, అభిమానానికీ ఏనుగు త‌ప్ప ఇంకేదీ స‌రితూగ‌దు'' అని స‌మాధానం ఇచ్చారట బాపినీడు.

 

ఈ విష‌యాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అన్న‌ట్టు విజ‌య‌బాపినీడు - చిరంజీవి కాంబోలో వ‌చ్చిన ఆఖ‌రి చిత్రం 'బిగ్ బాస్'. ఆసినిమా ఫ్లాప‌య్యాక కూడా చిరంజీవితో ఓసినిమా తీయాల‌ని బాగా ప్ర‌య‌త్నించారు బాపినీడు. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తాను నిర్మాత‌గా ఓ సినిమా చేద్దామ‌ని క‌థ‌లు కూడా విన్నార్ట‌రట. కానీ అవేవీ స‌ఫ‌లీకృతం కాలేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS