మ‌హేష్ కోస‌మే రాముల‌మ్మ ఒప్పుకుందా?

By Inkmantra - April 23, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

ఓ ద‌శ‌లో లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్‌లా సూప‌ర్ స్టార్ హోదా చ‌లాయించిన న‌టి.. విజ‌య‌శాంతి. గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో ఎంత పేరు తెచ్చుకుందో, క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల ద్వారా అంత‌కంటే ఎక్కువ క్రేజే సంపాదించింది. ఆ త‌ర‌వాత మ‌న‌సు రాజ‌కీయాల‌వైపుకు లాగ‌డంతో సినిమాల‌కు దూర‌మైంది. ఈ మ‌ధ్య ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌లు రీ ఎంట్రీ ఇస్తున్నా.. విజ‌య‌శాంతి మాత్రం సినిమాల‌ వైపు మొగ్గు చూపించ‌లేదు. ఎంత‌మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు సంప్ర‌దించినా, ఎంత భారీ పారితోషికం ఇస్తాన‌న్నా.. కాద‌ని చెప్పింది. అయితే మ‌హేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

 

ఎంత మంది అడిగినా 'నో' చెప్పిన రాములమ్మ‌... మ‌హేష్ సినిమాని ఎలా ఒప్పుకుందో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. అయితే. రాముల‌మ్మ‌ని ఒప్పించ‌డానికి అనిల్ రావిపూడి ఓ టెక్నిక్ ప్లే చేశాడ‌ట‌. రాముల‌మ్మ‌తో ఎస్ అనిపించ‌డానికి మ‌హేష్ బాబుని రంగంలోకి దింపాడ‌ట‌. `మ‌న క‌థ‌లో విజ‌య‌శాంతి ఉంటే బాగుంటుంది' అంటూ మ‌హేష్‌ని ప‌దే ప‌దే బ్రైయిన్ వాష్ చేసిన అనిల్‌... అదే మ‌హేష్‌తో విజ‌య‌శాంతికి ఫోన్ చేయించాడ‌ట‌. మ‌హేష్ ఫోన్ చేసి స్వ‌యంగా అడిగేస‌రికి విజ‌య‌శాంతి కాద‌న‌లేక‌పోయింద‌ని, పారితోషికం కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమాలో న‌టించ‌డానికి రెడీ అయ్యింద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS