విక్రమ్ సంగతి అందరికీ తెలిసిందే. సినిమా అంటే ప్యాషన్ విక్రమ్‌కి. పాత్ర గురించి ఏదైనా చేయడానికి సిద్ధమే. 'ఐ' సినిమా కోసం విక్రమ్ కష్టపడిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. అందుకే విక్రమ్‌కి సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం ఉండదు. కొత్త రకం కాన్సెప్ట్ సినిమాలంటే ముందుండే హీరో విక్రమ్. 'అపరిచితుడు' సినిమా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం విక్రమ్ తనయుడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. పేరు ధృవ్. ధృవ్ ఏమీ తక్కువ తినలేదండోయ్. తండ్రికి మించిన తనయుడేనట. తెలుగులో ఘన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి' సినిమాని తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్ కసరత్తులు ఎప్పుడో మొదలెట్టేశాడట. తెలంగాణా యాసతో విజయ్ దేవరకొండ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది 'అర్జున్‌రెడ్డి'లో. ఇప్పుడు ఆ క్యారెక్టర్‌నే ధృవ్ పోషిస్తున్నాడు. అయితే తమిళ వెర్షన్ కోసం చాలానే మార్పులు చేశారట. ఊహించని సస్పెన్స్‌లు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఒరిజినల్‌తో పోలిస్తే చాలా చాలా ప్రత్యేకతలు ఈ సినిమాలో ఉన్నాయట. సినిమాల్లోకి రాక ముందే ధృవ్ నటనలో మంచి శిక్షణ తీసుకున్నాడట. ఫైట్స్‌లోనూ శిక్షణ పొందాడట. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ సినిమా ధృవ్‌కి మంచి పేరు తీసుకొస్తుందనీ హీరోగా, తండ్రిని మించి స్థాయిలో నిలబెడుతుందనీ కోలీవుడ్ వర్గాల సమాచారమ్. ఈ సినిమా తర్వాత ఓ ప్రముఖ దర్శకుడితో మరో సినిమాకీ ధృవ్ సైన్ చేశాడనీ సమాచారమ్.