'వినయ విధేయ రామ' హైలైట్ యాక్షన్ సీన్ లీక్..!

By iQlikMovies - January 11, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్-కైరా అద్వానీ జంటగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రం భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలయ్యింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులందరినీ ఆనందపరిచేలా ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో హల్ చల్ చేస్తుంది. అయితే, సినిమా విడుదలైన కొద్ది గంటలకే మూవీలోని హైలైట్ అయిన యాక్షన్ సీన్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.

 

మెగా ఫాన్స్ అత్యుత్సాహంతో ఈ పని చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ సీన్ లో వినయ విధేయ రాముడు తన వైపు పరిగెత్తుకు వస్తున్న ఇద్దరు రౌడీల తలలను నరికేస్తాడు. గాల్లో ఎగిరిపడబోతున్న ఆ తలకాయలు డేగలు వచ్చి పట్టుకుపోవటం చూసి షాక్ అయిన విలన్ వివేక్ ఒబెరాయ్ గన్ తో వాటిని కాల్చబోతుంటాడు.. మాస్ ఆడియన్స్ అందరినీ అబ్బురపరిచేలా, రోమాలు నిక్కబొడిచేలా ఉందని ఈ సీన్ పై అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

 

అయితే.. థియేటర్ కి వెళ్లి థ్రిల్లింగ్ గా చూడాల్సిన ఈ దృశ్యం ముందే లీక్ అవ్వటం, అది కూడా మెగా అభిమానులే ఆ పని చెయ్యటం కొంచెం విషాదకరమైన విషయమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS