'వినయ విధేయ రామ' - సెగ మొదలైంది

మరిన్ని వార్తలు

సెగ అంటే నెగెటివ్‌ మీనింగ్‌ తీయొద్దు. ఈ సెగ సంగతి వేరే. సంక్రాంతి సీజన్‌ అంటేనే చలి చంపేస్తుంటుంది. ఈ టైమ్‌లో సినిమాల సెగ, అభిమానులకు బోల్డంత ఉత్సాహాన్నిస్తుంది. ఈ సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ముఖ్యంగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో ఒకటి 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు' కాగా, మరొకటి 'వినయ విధేయ రామ'.. మూడోది 'ఎఫ్‌2'. వీటిల్లో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అంటే అది 'వినయ విధేయ రామ' అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 

 

ఈ సినిమా ట్రైలర్‌ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ రోజే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా దర్శనమివ్వనున్నారు. చరణ్‌ హీరోగా గతంలో వచ్చిన 'ధృవ' ఈవెంట్‌కీ ఈయనే ముఖ్య అతిథి. అప్పట్లో మంత్రి హోదాలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారాయన. ఆ సంగతి పక్కన పెడితే, 'వినయ విధేయ రామ'కి సంబంధించి అసలు సిసలు స్టిల్స్‌ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. 

 

గుర్రమ్మీద చరణ్‌ సవారీ చేస్తున్న ఫొటో, దానికి తోడుగా తాజాగా విడుదలైన మరో మాస్‌ ఫొటో (ఫైట్‌ సీన్‌లోనిది) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతే కాదు, డాన్సింగ్‌ మూమెంట్‌తో కూడిన స్టిల్‌ కూడా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఏది ఏమైనా సంక్రాంతి ఫైట్‌కి సంబంధించి 'వినయ విధేయ రామ'తో స్వీట్‌ సెగ షురూ అయ్యిందని చెప్పక తప్పదు. గత ఏడాది 'రంగస్థలం' సినిమాతో 125 కోట్ల వసూళ్ళ ఫిగర్‌ని (షేర్‌) టచ్‌ చేసిన చరణ్‌, ఈసారి 150 కోట్లను అందుకుంటాడేమో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS