'తస్సాదియ్యా..' చెర్రీ, కైరా ఇరగదీసేశారయ్యా.!

మరిన్ని వార్తలు

'వినయ విధేయ రామ' నుండి 'తస్సాదియ్యా.. ' సాంగ్‌ ప్రోమో వీడియోని తాజాగా బయటికి వదిలారు. ఆడియో జ్యూక్‌ బాక్స్‌ విడుదలయ్యాక కొంత నెగిటివ్‌ ప్రచారం జరిగినా, వీడియో ప్రోమోస్‌ వచ్చాక ఆ నెగిటివిటీ అంతా పోజిటివ్‌ అయిపోయింది. 'తందాన ..' ఫ్యామిలీ సాంగ్‌ తీసుకుంటే, ఆడియో పరంగా స్లోగా అనిపించినా, విజువల్‌ పరంగా రెండు కళ్లూ చాలడం లేదు. జస్ట్‌ ప్రోమోస్‌కే ఇలా ఉంటే, ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియో ఇంకెంత కన్నుల పండగలా ఉంటుందో కదా.

 

ఇకపోతే స్పెషల్‌ సాంగ్‌ 'ఏక్‌ బార్‌..'లో చరణ్‌, ఈషాగుప్తా క్లాసీ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. లేటెస్టుగా వచ్చిన 'తస్సాదియ్యా..' సాంగ్‌ అయితే ఇరగదీసేస్తోంది. కైరా అద్వానీ​, చరణ్‌ మధ్య కెమిస్ట్రీ. డాన్సింగ్‌ స్కిల్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే ఇంతవరకూ తన డాన్సింగ్‌ పార్టనర్స్‌లో కైరా ఈజ్‌ ది బెస్ట్‌ పాట్నర్‌ అని కితాబిచ్చేశాడు చరణ్‌. బీట్‌కి తగ్గట్టుగానే ఈ పాటలో వీరిద్దరి ఎనర్జీ నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది.

 

డివివి దానయ్య కాస్ట్‌లీ నిర్మాణ విలువలు సాంగ్‌ సెట్టింగ్స్‌లోనూ బ్రైట్‌గా కనిపిస్తున్నాయి. గ్రాండియర్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇక పోస్టర్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. మాస్‌ అండ్‌ క్లాస్‌ లుక్స్‌తో చరణ్‌ చంపేస్తున్నాడు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్ర 'వినయ విధేయ రామ'కు మరో ఫ్రెష్‌ అప్పీల్‌ని తీసుకురానుంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS