అక్కినేని అఖిల్‌తో భారీ అంచనాల నడుమ 'అఖిల్' సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ వినాయక్. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితేనేం, అంతటి డిజాస్టర్ తర్వాత వినాయక్‌కి దక్కిన మెగా మెగా ఛాన్స్ 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమాతో వినాయక్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత తాజాగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఇంటెలిజెంట్'. భారీ అంచనాలతో మెగాస్టార్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో వినాయక్ తెరకెక్కించిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. అయితే విడుదలైన తర్వాత సీను రివర్సయ్యింది. మెగాస్టార్‌తో కలిసొచ్చిన అదృష్టం, మెగా మేనల్లుడి విషయంలో కలిసి రాలేదు. భారీగా నిరాశ పరిచింది.
ఇందుకు సరైన కథ దొరక్కపోవడం కావచ్చు, ఇతరత్రా మరే కారణాలైనా కావచ్చు. అలా అని వినాయక్ టాలెంట్‌నీ, అనుభవాన్ని తక్కువగా అంచనా వేయలేం. కమర్షియల్ అంశాలతో మంచి సినిమాని తెరకెక్కించగల సత్తా వినాయక్‌లో ఎప్పటికీ ఉంటుందనడం నిస్సందేహం. అందుకే ఫెయిల్యూర్స్ చవి చూసినా పలువురు యంగ్ హీరోలు వినాయక్ సినిమాలో నటించాలని క్యూ కడుతుంటారు. తాజాగా ఓ యంగ్ హీరో వినాయక్‌తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడట. అందుకోసం ఓ రీమేక్ సబ్జెక్ట్‌తో వినాయక్‌ని సంప్రదించాడనీ సమాచారమ్.
మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ తెరకెక్కించిన 150వ చిత్రం 'ఖైదీ' కూడా రీమేక్ సబ్జెక్టే. అంటే వినాయక్‌కి రీమేక్స్ బాగా కలిసొస్తున్నాయనుకోవాలి. ఒకవేళ ఆ యంగ్ హీరో తెచ్చిన సబ్జెక్ట్‌తో వినాయక్ సినిమా ట్రై చేస్తే, ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమేననీ అనిపిస్తోంది. ఏమో ఈ ఈక్వేషన్స్ ఫలించి, వినాయక్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి మరి.