తలైవా రజనీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రజనీ కుమార్తె సౌందర్య పెళ్లికి సిద్ధమైంది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్ వనంగమూడితో సౌందర్య వివాహం జరగబోతోంది. ఇటీవల ఇరువురి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. చెన్నైలోని ఓ స్టార్ హోటెల్లో ఫిబ్రవరి 11న వీరిద్దరి వివాహం జరగబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
2010లో సౌందర్య.. అశ్విన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 2017లో సౌందర్య, అశ్విన్ విడాకులు తీసుకున్నారు. విడాకుల తరవాత.. సౌందర్య సినిమాలకే పరిమితమైంది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే అని కోలీవుడ్ టాక్.