వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `యాత్ర`. ఆనందో బ్రహ్మతో ఆకట్టుకున్న మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.
వై.ఎస్.ఆర్ జీవిత కథే గానీ, ఎక్కువ శాతం పాద యాత్రకు సంబంధించిన అనుభవాలే తెరపై కనిపించనున్నాయి. వై.ఎస్.ఆర్‌ని ఎలివేట్ చేసిన సీన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అధిష్టానాన్ని ఎదిరించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వైఎస్ ఆర్ పట్టుదలని, క్రమశిక్షణని, నిబద్ధతనీ చూపించే స్ననివేశాల సమాహారంగా ఈసినిమా సాగబోతోందని తెలుస్తోంది.
తొలి సగం వైఎస్ ఆర్ ఎదిగిన క్రమం చూపిస్తూ. ద్వితీయార్థంలో పాద యాత్రకు పట్టంకట్టారని, సీఎమ్‌గా ప్రమాణ స్వీకారం చేయడం, హెలీకాఫ్టర్ ప్రమాదం మరణించడం ఇవన్నీ క్లైమాక్స్ దృశ్యాలుగా వస్తాయని సమాచారం. నిడివి పరంగా చూస్తే 2 గంటల 8నిమిషాల మాత్రమే. కాబట్టి చిన్న సినిమా కిందే లెక్క. వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారని, ఆయన నటనే ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది.