ఎన్నికలు అయిపోయాయి. మెగా బ్రదర్స్ ఓడిపోయారు. గాజువాక, భీమవరం ఓటర్లు పవన్‌ని ఓడిస్తే... నరసాపురంలో నాగబాబు చేతులెత్తేశారు. మొత్తానికి రాజకీయాల్లో 'మెగా' అంకం ఇక పరిసమాప్తమైనట్టే. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఐదేళ్ల పాటు 'జనసేన'ని కాపాడుకుని రావడం పవన్‌ని అసాధ్యమైన పని. మరి ఇప్పుడు వీరిద్దరూ ఏం చేస్తే బెటర్..?? పవన్ ఇప్పటికీ సినిమాల్లో సూపర్ స్టారే. అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయకుల్లో పవన్ ఒకడు. సినిమాల్లో తన క్రేజ్ ఇంకా తగ్గలేదు.
పవన్ మళ్లీ సినిమాల్లోకి రావాలని, తమకు వినోదం పంచి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. దానికి తోడు పవన్ చేతిలో అడ్వాన్సులు కూడా ఉన్నాయి. మైత్రీ మూవీస్ సంస్థకి పవన్ ఓ సినిమా చేయాలి. దాంతో పాటు మరో నిర్మాత కూడా ఇప్పటికే వవన్‌కి అడ్వాన్స్ ఇచ్చాడు. సో.. ఈ రెండు సినిమాలు చేద్దామని పవన్ డిసైడ్ అయిపోతే - మరో రెండేళ్ల పాటు పవన్ బిజీగా ఉంటాడు. ఆ తరవాత... ఓపిక ఉంటే మళ్లీ జనసేన పార్టీ గురించి ఆలోచించొచ్చు. నాగబాబు పరిస్థితీ ఇంతే. తనకు ఎలాగూ 'జబర్‌దస్త్' షో ఉంది.
ఈ షోతోనే నాగబాబు బుల్లి తెర ప్రేక్షకులు బాగా దగ్గరయ్యాడు. `ఎంపీ అయినంత మాత్రాన జబర్‌దస్త్ షో వదలను` అని అప్పట్లోనే చెప్పేశాడు నాగబాబు. సో... ఆ వేదిక నాగబాబుకి ఇంకా ఉన్నట్టే. మరోవైపు.. నటుడిగానూ తను బిజీనే. నరసాపురం ఎంపీగా ఓటమితో.. మరోసారి ఎన్నికల్లో అడుగుపెట్టే సాహసం నాగబాబు చేయకపోవొచ్చు. జబర్‌దస్త్ జడ్జ్‌గా, సహాయ నటుడిగా.. ఆయన బిజీ అయిపోతే - ఈ ఓటమి భారాన్ని తొందరగా మర్చిపోయే ఛాన్సుంది.