ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ "ఎంత మంచివాడవురా". కాగా ఈ చిత్రం కథ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. హీరో చేసే కొన్ని పనులు వల్ల ఓ ఊరుకి పెద్ద మేలు జరుగుతుందట. అలాగే అప్పటికే హీరో చేసిన ఆకతాయి పనులు కారణంగా కూడా చాలామందికి మంచి జరుగుతుందని.. అయితే హీరో ఇవ్వన్నీ తానూ కావాలని చేయడని.. కానీ అనుకోకుండా అతను చేసే పనులు అన్నీ మంచివి అవుతూ ఉంటాయట. ఇదే ఈ సినిమా పాయింట్ అని తెలుస్తోంది. అయితే గతంలోనూ ఈ సినిమా కథ గురించి ఓ అప్ డేట్ వచ్చింది.
గుజరాతీ సినిమా 'ఆక్సిజన్' మూవీ ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారని... కథ విషయానికి వస్తే.. నాటకం స్టేజ్ పైనే పుట్టిన హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాటక రంగమే అని నమ్ముతాడట. ఆ తరువాత అందరికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడని.. ఈ సినిమా కథాంశం ఇదేనని గతంలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.
కాగా శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', అలాగే బన్నీ 'అల వైకుంఠపురంలో' సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి పోటీగా "ఎంత మంచివాడవురా" సినిమా కూడా రాబోతుంది. మరి ఈ పోటీలో ఎవ్వరు నెగ్గుతారో చూడాలి.