118తో కళ్యాణ్‌రామ్‌ ఊరటనిస్తాడా.?

మరిన్ని వార్తలు

నందమూరి అభిమానులు చాలా డిప్రెషన్‌లో వున్నారిప్పుడు. అందుకు బలమైన కారణం ఎన్టీఆర్ బయోపిక్‌ ఫెయిల్యూర్‌. స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటేనే తెలుగు జాతి ఆత్మగౌరవం అనే అభిప్రాయం బలంగా వున్నా, ఆ మహనీయుడు బయోపిక్‌, కనీస స్థాయిలోనూ ప్రేక్షకుల్ని అలరించకపోవడం ఆశ్చర్యకరం. కథానాయకుడు కావొచ్చు, మహానాయకుడు కావొచ్చు కంటెంట్‌ పరంగా మరీ తీసికట్టుగా లేకపోయినా, ఫలితం చాలా దారుణంగా వచ్చింది.

 

కథానాయకుడు 20 కోట్లకే పరిమితం కాగా, మహానాయకుడు పరిస్థితి మరీ దారుణం. ఇంత భయంకరమైన ఫలితాన్ని నందమూరి అభిమానులే కాదు, సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు కలలో కూడా ఊహించలేదు. హీరోగా బాలకృష్ణ, దర్శకుడిగా క్రిష్‌.. భారీ స్థాయిలో వ్యయం.. అన్నిటికీ మించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇమేజ్‌.. ఇవేవీ ఈ బయోపిక్‌ని కాపాడలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నందమూరి కుటుంబంనుంచి మరో సినిమా వస్తోంది, అదే 118. 

 

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో లక్కీ బ్యూటీ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా నివేదా థామస్‌ కన్పించనున్న విషయం విదితమే. థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ 118 పట్ల ఓవర్సీస్‌లోనూ మంచి బజ్‌ కన్పిస్తోంది. అయితే ఆ బజ్‌ని 118 అందుకుంటుందా.? లేదా.? అన్నదే ప్రశ్న. ప్రీ రిలీజ్‌ అంచనాలు పాజిటివ్‌ వైబ్స్‌ని క్రియేట్‌ చేస్తున్న దరిమిలా, కళ్యాణ్‌రామ్‌ విజయాన్ని ఇవ్వగలిగితే, నందమూరి అభిమానులకు అది పెద్ద పండగే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS