ఆ ఇద్దరి భామల ముద్దుల గ్లామర్‌ 'వెంకీ మామ'కు ప్లస్‌ అవుతుందా.?

మరిన్ని వార్తలు

వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతికి 'ఎఫ్‌ 2'తో మంచి విజయం అందుకున్నాడు. వెంకీ, వరుణ్‌ అల్లుళ్లుగా కనిపించిన ఈ సినిమా సంక్రాంతికి చక్కని వినోదం పంచడంతో పాటు, బాక్సాఫీస్‌కి కాసుల వర్షం కూడా కురిపించింది. ఇక వెంకీ ఇప్పుడు మరోసారి మల్టీ స్టారర్‌తోనే వస్తున్న సంగతి తెలిసిందే. అదే 'వెంకీ మామ'. చైతూ మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయ్యింది. 

 

చాలా వరకూ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్‌ చేయనున్నారట. ఇక కథ విషయానికి వస్తే, 'ఎఫ్‌ 2'ని మించిన ఫన్‌ ఈ సినిమాలో ఉండబోతోందట. ఫ్యామిలీ ఆడియన్స్‌ సకుటుంబ సపరివారంగా కూర్చొని తిలకించేలా ఈ సినిమా ఉండబోతోందట. ఇక గ్లామర్‌ విషయానికి వస్తే, హాట్‌ బ్యూటీ పాయల్‌, క్యూట్‌ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారీ సినిమాలో. పాయల్‌ గ్లామర్‌ యాంగిల్‌ని ఆల్రెడీ చూసేశాం 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాలో. 

 

సీనియర్‌ హీరో వెంకటేష్‌కి జోడీగా నటిస్తోంది కదా అని ఈ సినిమాలో అమ్మడి గ్లామర్‌ డోస్‌ తక్కువగా ఉంటుందనుకునేరు. గ్లామర్‌లో అస్సలేమాత్రం కాంప్రమైజ్‌ కానే కాదీ బ్యూటీ. ఇక రాశీఖన్నా 'బెంగాల్‌ టైగర్‌'లో బికినీ సోయగాలతో రెచ్చిపోయింది. ఇప్పుడు చైతూ పక్కన కూడా ఆ రేంజ్‌ గ్లామర్‌ ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉందట. 'ఎఫ్‌ 2' బ్లాక్‌ బస్టర్‌ విజయంలో తమన్నా, మెహ్రీన్‌ల గ్లామర్‌ యాంగిల్‌ అత్యంత కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. మరి 'వెంకీ మామ' సక్సెస్‌కి ఈ ఇద్దరు భామల గ్లామర్‌ ఎంతమేర యూజ్‌ అవుతుందో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS