తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం `తని ఒరువన్`. జయం రవికి ఈ సినిమా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. అతని సోదరుడు మోహన్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సోదరులిద్దరూ `తని ఒరువన్ 2` కోసం తయారవుతున్నారు. ఇప్పటికే మోహన్ రాజ్ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టు టాక్. 2021 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. `తని ఒరువన్`ని తెలుగులతో ధృవ గా తెరకెక్కించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
తమిళంలో లానే తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యిందీ సినిమా. తమిళంలో సీక్వెల్ వస్తోంది కాబట్టి, తెలుగులోనూ ఆశించడంలో తప్పు లేదు. పైగా... ఈ సీక్వెల్ కోసం రామ్ చరణ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు టాక్. ధృవ, సైరా తరవాత.. సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాలని రామ్ చరణ్ ఫిక్సయ్యాడు. సూరి కూడా చరణ్ తో సినిమా చేయడానికి రెడీనే. అది తని ఒరువన్ 2 అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. తని ఒరువన్ విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోగానే ఆ హక్కుల్ని చరణ్ సొంతం చేసుకునే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్.