రెడ్ హాట్‌లో ఎవరీ బిగ్‌బాస్ బ్యూటీ.? ఏ సీజన్‌లో కనిపించింది.? అనుకుంటున్నారా.? అయితే మీకు ఈ బ్యూటీ గురించి తెలియాల్సిందే. తమిళ బిగ్‌బాస్ సీజన్ 2లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా కనిపించిందీ ఫోటోలోని హాట్ బ్యూటీ. పేరు యాషికా ఆనంద్. సోషల్ మీడియాలో పాప సో యాక్టివ్. హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేయడంలో హైపర్ యాక్టివ్. తాజా ఫోటోలో పెద్దగా గ్లామర్ కనిపించకున్నా, పాప ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేస్తే, మైండ్ బ్లాంక్ అయ్యే పిక్స్ దర్శనమిస్తాయి. ఈ సంగతి అటుంచితే, పాపకి వివాదాలతోనూ సావాసం ఎక్కువే మరి. సందర్భంతో పని లేకుండా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో హాట్ టాపిక్ అవ్వాలనుకుంటూ ఉంటుంది.
ఇకపోతే, తెలుగులో ఓ సినిమాలో కనిపించిందండోయ్. విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’లో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న యాషికా ఆనంద్, తెలుగు సినిమాలపైనా గట్టిగా ఫోకస్ పెట్టిందట. ఎలాంటి గ్లామరస్ రోల్స్‌కైనా పాప సై సై కాబట్టి, ఫోకస్ కరెక్ట్‌గా పెడితే, ఛాన్సెస్ కూడా బాగానే వర్కవుట్ అవుతాయిలే.